శంకర్-రామ్ చరణ్ కాంబో మూవీ గేమ్ ఛేంజర్ టీజర్ ఈరోజు విడుదల చేస్తామని ప్రకటించారు కానీ ఎన్ని గంటలకో చెప్పకుండా సస్పెన్స్ పెట్టడంతో ఈరోజు ఉదయం నుంచి రామ్ చరణ్ అభిమానులు టీజర్ కోసం సోషల్ మీడియాలో ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు.
ఒకవేళ ఇప్పటికే విడుదలైందేమోనని నెట్‌లో వెతుకుతూనే ఉన్నారు. సాయంత్రం అవుతున్నా ఇంత వరకు టీజర్ గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో వాయిదా పడిందేమోనని అందరూ నిరాశ చెందుతుంటే, మరో కొత్త పోస్టర్‌తో ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్నట్లు గేమ్ ఛేంజర్ టీమ్ ప్రకటించింది. దీంతో అభిమానులకు మళ్ళీ ఉత్సాహం వచ్చింది. టీజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
టీజర్ రిలీజ్ పోస్టర్‌లో రామ్ చరణ్ సూటు, బూటు, చేతిలో మైక్ పట్టుకొని చాలా స్టయిలిష్‌గా ఉన్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా చేస్తున్నందున, రోడ్డుపై గొడవలకు వచ్చిన అల్లరి మూకలను ఉద్దేశ్యించి హెచ్చరిస్తున్నట్లు పోస్టర్ ఉంది.
గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్‌కి జంటగా కియరా అద్వానీ, మరో పాత్రకి జంటగా అంజలి చేస్తున్నారు. ఈ సినిమాలో ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మించిన గేమ్ ఛేంజర్ జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగ ముందు విడుదల కాబోతోంది.