గేమ్ ఛేంజర్‌ టీజర్‌ రిలీజ్ హైదరాబాద్‌లో... ఎక్కడంటే....

November 08, 2024


img

రేపు (శనివారం) ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో గేమ్ ఛేంజర్‌ టీజర్‌ విడుదల చేయబోతున్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లో సుదర్శన్ థియేటర్, ఖమ్మంలో ఎస్‌వీసీ శ్రీ తిరుమల థియేటర్లో కూడా టీజర్‌ విడుదల చేయబోతున్నారు. 

ఆంధ్రాలో వైజాగ్: సంగం శరత్ థియేటర్స్, రాజమండ్రి: శివజ్యోతి థియేటర్, విజయవాడ: శైలజ, కర్నూలు: వి మెగా థియేటర్, నెల్లూరు: ఎస్‌2 థియేటర్, తిరుపతి: పీజీఆర్ థియేటర్, అనంతపురం: త్రివేణీ థియేటర్, బెంగళూరు: ఊర్వశీ థియేటర్లలో గేమ్ ఛేంజర్‌ టీజర్‌ని రేపు విడుదల చేయబోతున్నారు. 

రామ్ చరణ్‌, కియరా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్‌ నటుడు ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం, అంజలి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్‌.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు. 

నిర్మాతలు దిల్‌రాజు, శిరీశ్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025, జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగకు ముందు 5 భాషల్లో విడుదల కాబోతోంది.      



Related Post

సినిమా స‌మీక్ష