కన్నప్పలో శివుడు ప్రభాస్‌ కాదు అక్షయ్ కుమార్?

April 16, 2024


img

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్‌ ప్రవేశించారు. ఈ విషయం తెలియజేస్తూ,”సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌ రాకతో మా ఈ కన్నప్ప ప్రయాణం మరింత రసవత్తరంగా మారింది. తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశిస్తున్న ఆయనకు కన్నప్ప టీం స్వాగతం చెపుతూ, సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలియజేస్తూ ఆయన ఫోటో, వీడియోని అభిమానులతో పంచుకుంది. 

‘కన్నప్ప’ని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో విడుదల చేయబోతున్నందున ఉత్తరాది, దక్షిణాది ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. కన్నప్ప సినిమాలో మంచు విష్ణుకి జోడీగా బాలీవుడ్‌ నటి నుపూర్ సనన్ నటిస్తోంది.

ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, అక్షయ్ కుమార్, ప్రీతి తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్‌ శివుడిగా నటిస్తారని మంచు విష్ణు మొదట సూచించారు. కానీ హిందీ సినిమా ‘ఓ మై గాడ్-2’లో శివుడిగా నటించి మెప్పించిన అక్షయ్ కుమార్‌ ప్రవేశంతో ప్రభాస్‌ బదులు ఆయన శివుడు పాత్ర చేయబోతున్నారా? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభిస్తుంది.  

స్టార్ ప్లస్ టీవీలో ప్రసారమైన మహాభారత్ హిందీ సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్‌ సింగ్‌ కన్నప్ప సినిమాకు దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

 కన్నప్ప సినిమా షూటింగ్‌ చాలా వరకు న్యూజిలాండ్‌లోనే పూర్తయింది. మిగిలిన భాగాన్ని పూర్తిగా హైదరాబాద్‌లోనే షూటింగ్‌ చేసి ఈ ఏడాది దసరా, దీపావళి పండుగ సీజనులో విడుదల చేయాలని మంచు విష్ణు భావిస్తున్నారు. 

కన్నప్ప సినిమాకు మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ: సంగీతం, షెల్డన్ షావ్: కెమెరా, చిన్న ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.  

ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నిర్మిస్తున్నారు. 

 


Related Post

సినిమా స‌మీక్ష