లారెన్స్ రాఘవ ఒకేసారి రెండు కొత్త సినిమాలు!

April 14, 2024


img

రాఘవ లారెన్స్ తమిళ నటుడే అయినప్పటికీ తెలుగులో అనేక సినిమాలు చేసినందున తెలుగు ప్రేక్షకులకు చిర పరిచితుడే. ఇప్పుడు ఆయన కోలీవుడ్‌ దర్శకుడు బక్య రాజ్‌ కన్నన్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా పేరు ‘బెంజ్’ అని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. మరో విశేషమేమిటంటే, ఈ సినిమాకు కోలీవుడ్‌ స్టార్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ కధ అందిస్తున్నారు. 

రాఘవ లారెన్స్ మరో సినిమా’హంటర్’ కూడా ప్రకటించాడు. తమిళంలో కత్తి (తెలుగులో చిరంజీవి నటించిన ఖైదీ 150) సినిమాకు దర్శకత్వం వహించిన వెంకట్ మోహన్ ఈ సినిమాకు దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. ఒకేసారి రెండు సినిమాలు ప్రకటించడంతో రాఘవ లారెన్స్ అభిమానులు చాలా సంతోషపడుతున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాలకు సంబందించి పూర్తి వివరాలు వెలువడనున్నాయి. 


Related Post

సినిమా స‌మీక్ష