అమెజాన్ ప్రైమ్‌లో ఓం భీమ్ బుష్!

April 11, 2024


img

ఇటీవల విడుదలైన చిన్న సినిమాలలో శ్రీహర్ష కొంగుగంటి దర్శకత్వంలో  వచ్చిన ‘ఓం భీమ్ బుష్’ కూడా ఒకటి. ఈ సినిమాలో ‘నో లాజిక్... ఓన్లీ మ్యాజిక్’ అని ముందే ప్రకటించారు కనుక ప్రేక్షకులు కూడా లాజిక్ గురించి ఆలోచించకుండా సినిమాని చూసి ఎంజాయ్ చేశారు. 

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ప్రధాన పాత్రలు చేసిన ‘ఓం భీమ్ బుష్’ సినిమా మార్చి 22న విడుదలై మంచి కలక్షన్స్‌ రాబట్టుకొంది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రేపు (శుక్రవారం) నుంచి ప్రసారం కాబోతోంది. దీని కోసం ప్రేక్షకులు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కనుక ఓటీటీలో కూడా మంచి ఆదరణ లభిస్తుందనే భావించవచ్చు.  

ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, షాన్ కక్కర్, సూర్య శ్రీనివాస్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శ్రీహర్ష, సంగీతం: సన్నీ ఎంఆర్, కెమెరా: రాజ్ తోట, ఎడిటింగ్: విజయ్‌ వర్ధన్ కుమార్‌ చేశారు.


Related Post

సినిమా స‌మీక్ష