కోలీవుడ్‌ నటుడు డానియల్ బాలాజీ గుండెపోటుతో మృతి

March 30, 2024


img

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు డానియల్ బాలాజీ (48) శుక్రవారం అర్దరాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం సినిమాలలో నటించారు. తెలుగులో సాంబ, చిరుత, ఘర్షణ, టక్ జగదీష్ వంటి కొన్ని సినిమాలలో నటించారు. 

బాలాజీకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. సెట్స్‌లో చాలా హుషారుగా అందరితో కలివిడిగా ఉంటారు. అటువంటి వ్యక్తి ఇంత చిన్న వయసులో అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారనే వార్తని ఎవరూ నమ్మలేకపోతున్నారు. కోలీవుడ్‌ సూపర్ ఫ్యామిలీ స్టార్‌ విజయ్‌, డానియల్ బాలాజీ ఇద్దరూ మంచి స్నేహితులు. 

డానియల్ బాలాజీకి దైవభక్తి చాలా ఎక్కువ. తమిళనాడులోని ఆవాడిలో ఓ ఆలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. దాని నిర్మాణం పూర్తికాక మునుపే బాలాజీ చనిపోవడంతో ఆవడిలో ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. ఈరోజు (శనివారం) మధ్యాహ్నం చెన్నైలో బాలాజీ అంత్యక్రియలు జరుగనున్నాయి.


Related Post

సినిమా స‌మీక్ష