శర్వా మనమే... ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

March 28, 2024


img

శర్వానంద్, కృతి శెట్టి జంటగా తెరకెక్కిస్తున్న ‘మనమే’ సినిమా నుంచి ఇవాళ్ళ ఐఫిల్ టవరే ఒంటరిగా అంటూ సాగే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. 

కృష్ణ చైతన్య వ్రాసిన ఈ పాటకు హెషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరచి స్వయంగా పాడారు. ఈ పాటకు శ్రష్టి ప్రశాంత్ వర్మ కొరియోగ్రఫీ చేశారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్‌ ‘వరల్డ్ ఆఫ్ మనమే’ ఇటీవలే విడుదల చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం శ్రీరామ్ ఆదిత్య, డైలాగ్స్: అర్జున్, కార్తీక్, ఏఆర్ టాగూర్, వెంకట్ డి పతి, సంగీతం: హెషామ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: విష్ణుశర్మ, జ్ఞాన శేఖర్, కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి, శ్రష్టి వర్మ, విజయ్‌ పోలకి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: జానీ షేక్, స్టంట్స్‌: రియల్ సతీష్, కెఎన్ఆర్ (నిఖిల్) చేస్తున్నారు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, వివేక్‌ రామస్వామి కూచిభొట్ల సహ నిర్మాతగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.

 



Related Post

సినిమా స‌మీక్ష