వనపర్తిలో సిద్దార్థ్, అదితి రావు వివాహం

March 27, 2024


img

ప్రముఖ నటులు సిద్దార్థ్, అదితిరావు హైదరీ బుధవారం ఉదయం వనపర్తి జిల్లాలోని శ్రీ రంగనాధస్వామి ఆలయంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వారి వివాహ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహిత బంధువులు, కొద్ది మంది మిత్రులు మాత్రమే హాజరయ్యారు.

వారి వివాహ కార్యక్రమం గురించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచడంతో, వారందరూ ఈరోజు ఉదయం ఆలయం చేరుకునే వరకు  శ్రీరంగాపూర్ గ్రామస్తులకు కూడా ఈ విషయం తెలియలేదు. తమిళనాడు నుంచి వచ్చిన పురోహితులు వారి వివాహం జరిపించారు. 

అయితే వారిరువురికీ కూడా ఇది రెండో వివాహమే. సిద్ధార్థ్ తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను వివాహం చేసుకొని విభేధాలు రావడంతో 2007లో విడాకులు తీసుకున్నారు. అదితి రావు సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకొని విభేదాల కారణంగా 2012లో విడాకులు తీసుకున్నారు. 

సిద్ధార్థ్, అదితి రావు తొలిసారిగా అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం (2021) సినిమాలో కలిసి నటించారు. అప్పుడే వారు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి కలిసి తిరుగుతున్నారు. ఇన్నేళ్ళ తర్వాత ఇద్దరూ వివాహం బందంతో ఏకమయ్యారు. కానీ వారు తమ వివాహం గురించి సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించలేదు.


Related Post

సినిమా స‌మీక్ష