అమెజాన్ ప్రైమ్‌లో భగవంత్ కేసరి... నేటి నుంచే

November 24, 2023


img

నందమూరి బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రలలో దసరాకు విడుదలైన భగవంత్ కేసరి సినిమా నేటి (శుక్రవారం) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. తండ్రీ కూతుర్ల సెంటిమెంటుతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తీసిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో శ్రీలీల బాలకృష్ణ కూతురుగా అద్భుతంగా నటించింది. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: ఎస్ఎస్ ధమన్, కెమెరా: సి.రాంప్రసాద్, ఎడిటింగ్: తమ్మిరాజు, స్టంట్స్‌: వి వెంకట్ చేశారు. 

ఈ సినిమాలో రాంపాల్, శ్రవణ్, ప్రియాంకా జవల్కర్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్ శంకర్‌ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష