డిసెంబర్‌ 1న సలార్ ట్రైలర్‌ రిలీజ్

November 13, 2023


img

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రుతీ హాసన్‌ జంటగా నటిస్తున్న సలార్ ట్రైలర్‌ త్వరలో విడుదల చేస్తామన్న హామీని చిత్ర బృందం నిలబెట్టుకొంటోంది. డిసెంబర్‌ 1వ తేదీ సాయంత్రం 7.19 గంటలకు ట్రైలర్‌ విడుదల చేస్తామని తెలియజేస్తూ ప్రభాస్ పోస్టర్ ఒకటి నిన్న విడుదల చేసింది. ఇదివరకు విడుదల చేసిన టీజర్‌తో సలార్‌పై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ట్రైలర్‌ ఏవిదంగా ఉంటుందో చూడాలి. సలార్ డిసెంబర్‌ 22న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. 

సలార్‌లో జగపతిబాబు, ఈశ్వరీ రావు, శ్రీయరెడ్డి, మలయాళ సినీ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్‌ సీనియర్ నటుడు టీను ఆనంద్, రామచంద్రరాజు, సప్తగిరి, బ్రహ్మాజీ, పృధ్వీరాజ్, ఝాన్సీ, మధు గురుస్వామి, నాగ మహేశ్, దుబ్బాక భాస్కరరావు, జెమిని సురేశ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్, కెమెరా: భువన్ గౌడ, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. 

ఈ సినిమాను హోంభోలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్ రూ.200-250 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష