డిసెంబర్‌లోసలార్... ఎప్పుడంటే...

September 29, 2023


img

ప్రభాస్, శ్రుతీ హాసన్‌ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రం సెప్టెంబర్‌ 28న విడుదల కావలసి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా పడింది. దీంతో ప్రభాస్ అభిమానులు, ముఖ్యంగా అమెరికాలో ఇప్పటికే అడ్వాన్స్ టికెట్స్ బుక్ చేసుకొన్నవారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

అయితే ఈ సినిమాను నిర్మిస్తున్న హోంభోలే ఫిలిమ్స్ సలార్ సినిమాను డిసెంబర్‌ 22న విడుదల చేయబోతున్నట్లు శుక్రవారం ఉదయం ట్విట్టర్‌లో ప్రకటించింది. సినిమా విడుదల కావలసిన సమయంలో మళ్ళీ ఎప్పుడు విడుదలవుతుందో ప్రకటించడం విశేషం.

కనీసం ఈసారైనా సలార్ మళ్ళీ వాయిదా వేయకుండా ఉంటే అంతే చాలని అభిమానులు అనుకొంటున్నారు. ఎందుకంటే డిసెంబర్‌లో మళ్ళీ వాయిదా పడితే 2024 ఏప్రిల్ వరకు వరుసపెట్టి సినిమాలు ఉంటాయి కనుక ఆ తర్వాతే ఎప్పుడో వీలుచూసుకొని విడుదల చేయాల్సి ఉంటుంది. 

కొన్ని రోజుల క్రితం విడుదలైన సలార్ టీజర్‌ బాగుంది కానీ సినిమా రిలీజ్ వాయిదా వేసినందున అభిమానులను చల్లబరచడానికి ఫస్ట్ గ్లింప్స్, ఓ లిరికల్ వీడియో సాంగ్ అయినా విడుదల చేస్తే బాగుంటుంది. 

ఈ సినిమాలో జగపతిబాబు, ఈశ్వరీ రావు, శ్రీయరెడ్డి, పృధ్వీరాజ్ సుకుమారన్, టీను ఆనంద్, రామచంద్రరాజు, సప్తగిరి, బ్రహ్మాజీ, పృధ్వీరాజ్, ఝాన్సీ, మధు గురుస్వామి, నాగ మహేశ్, దుబ్బాక భాస్కరరావు, జెమిని సురేశ్    ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: రాష్ట్రవ్యాప్తంగా బస్రూర్, కెమెరా: భువన్ గౌడ, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. 

ఈ సినిమాను హోంభోలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్‌ దేవరకొండ కిరగందూర్ రూ.200-250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష