గేమ్ చేంజర్‌ పాట లీక్... క్రిమినల్ కేసు నమోదు

September 18, 2023


img

శంకర్ దర్శకత్వంలో రామ్ చర  , కీయరా అద్వానీ జంటగా నటిస్తున్న గేమ్ చేంజర్‌ సినిమాకు లీకుల బెడద ఎక్కువైపోయింది. ఇటీవలే గేమ్ చేంజర్‌ సినిమా నుంచి ఓ ఫోటో లీక్ అయిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఓ పాట మొత్తం లీక్ అయిపోవడంతో ఈ సినిమాను నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర క్రియెషన్స్ అప్రమత్తమై వెంటనే సోషల్ మీడియాలోకి వచ్చిన ఈ పాటను తొలగింపజేసింది. అలాగే ఈ పాట చెన్నై నుంచి లీక్ అయిన్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సెక్షన్ 66(సి)కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ సినిమాలో రామ్ చరణ్‌ తండ్రికొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు గతంలో లీక్ అయిన ఫోటోల వలన బయటపడింది. వాటిలో తండ్రి పాత్రకు జోడీగా అంజలి, కొడుకు పాత్రకు జోడీగా కియరా అద్వానీ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎస్ జే సూర్య, సునీల్, నాజర్, రఘుబాబు, జయరాం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

గేమ్ ఛేంజర్‌ సినిమాను రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు, అల్లు శిరీష్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కధ: కార్తీక్ సుబ్బరాజు, కెమెరా: తిరు, ఆర్‌ రత్నవేలు, థమన్: సంగీతం అందిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష