శ్రీకాంత్ అడ్డాల జూన్ 2న ఏమి షాక్ ఇవ్వబోతున్నారో?

May 30, 2023


img

తన హీరోల చేత కనీసం కర్ర కూడా పట్టించని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఫ్యామిలీ ఆడియన్స్ తప్ప వయోలెన్స్ జోలికి పోయేవాడు కాదు. కొత్త బంగారు లోకం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం సినిమాలే ఇందుకు నిదర్శనం. అటువంటి దర్శకుడు వెంకటేష్ని హీరోగా పెట్టి 2021లో నారప్ప సినిమా తీసి దానిలో రక్తం పారించాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 

ఆ తర్వాత చాలా రోజులు సైలెంట్‌గా ఉండిపోయారు. శ్రీకాంత్ అడ్డాల ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై ఓ సినిమాని స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు ఆ సినిమా అప్‌డేట్స్ ఏమీ రాలేదు. ఈరోజు సడన్‌గా తమ సినిమా టైటిల్‌, హీరో ఫస్ట్-లుక్‌ పోస్టర్‌ జూన్ 2న ఉదయం 11.39 గంటలకు విడుదల చేయబోతునట్లు ట్వీట్‌ చేశారు. దానిలో కత్తిగాట్లు ఉన్న ఓ చేతిని మాత్రం చూపుతూ పీకే-1 అంటూ చిన్న సస్పెన్స్ పెట్టారు. అంటే ఎవరైనా కొత్త హీరోను ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారా? అయితే ఆ హీరో ఎవరు?అసలు ఈ సినిమా దేని గురించి? అనే వివరాలు తెలియాలంటే జూన్ 2వరకు ఎదురుచూడాల్సిందే. బాలకృష్ణతో అఖండ వంటి సూపర్ హిట్ సినిమా తీసిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష