ఆర్ఆర్ఆర్‌ విలన్‌ రే స్టీవెన్సన్ మృతి

May 23, 2023


img

రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ హీరోలుగా వచ్చిన్న ఆర్ఆర్ఆర్‌ సినిమాలో క్రూరుడైన బ్రిటిష్ గవర్నర్‌ స్కాట్ బక్స్ టన్ పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ (58) మొన్న ఆదివారం ఇటలీలో అకస్మాత్తుగా మృతి చెందారు. గుండెపోటుతో ఆయన చనిపోయిన్నట్లు సమాచారం.

రే స్టీవెన్సన్ నార్త్ ఐర్లాండ్ దేశంలో లిస్‌బర్న్‌లో జన్మించారు. బ్రిటన్‌లోని ఓల్డ్ విక్ థియేటర్‌లో నటనలో శిక్షణ పొందారు. మొదట టీవీ షోలలో మంచి నటుడిగా పేరు తెచ్చుకొన్నాక 1998 నుంచి హాలీవుడ్ సినిమాలలో నటించడం ప్రారంభించారు. కింగ్ ఆర్దర్, పనిషర్ వార్ జోన్, జో రిటాలియేషన్, మెమొరీ, థోర్ వంటి అనేక సినిమాలలో నటించి మెప్పించారు.

ఓ పక్క సినిమాలలో నటిస్తూనే స్టార్ వార్స్ రెబెల్స్, డెక్స్ టార్ వంటి టీవీ షోలలో కూడా పాల్గొని తనదైన శైలిలో షోలు నడిపించి అందరినీ మెప్పించారు.

ఆయన చివరిగా అశోకా వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఇది త్వరలోనే డిస్నీ +హాట్ స్టార్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది. రే స్టీవెన్సన్ మృతి పట్ల ఆర్ఆర్ఆర్‌ బృందం సంతాపం వ్యక్తం చేస్తూ తమ సినిమాలో ఆయన ఫోటోతో ట్వీట్‌ చేసింది.  Related Post

సినిమా స‌మీక్ష