మహానటుడికి నివాళిగా రెండు రోజులు షూటింగులు ఆపలేరా?

September 12, 2022


img

తెలుగువారి అభిమాన నటుడు కృష్ణంరాజు మృతిపట్ల తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులందరూ హైదరాబాద్‌లో ఆయన నివాసానికి వెళ్ళి నివాళులు ఆర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతీఒక్కరూ ఆయనతో తమ అనుబందాన్ని గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకొంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం, కనకమామిడిలో ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. 

అయితే ఈ విషాదసమయంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం విశేషం.  కృష్ణంరాజు వంటి మహానటుడికి తెలుగు సినీ పరిశ్రమ మొత్తం నివాళులు అర్పించాలని వర్మ కోరుకోవడంలో తప్పు లేదు కానీ రెండు రోజులు సినిమా షూటింగులు నిలిపివేసి కృష్ణంరాజుకి నివాళులు అర్పించకపోతే కృష్ణ, మురళీమోహన్, చిరంజీవి, మోహన్ బాబు, బాలయ్య, ప్రభాస్, మహేష్, పవన్‌ కళ్యాణ్‌లకి రేపు ఇదే దుస్థితి తప్పదు,” అని అనడంపై వారి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    

 ఇంతకీ రాంగోపాల్ వర్మ ఏమి ట్వీట్ చేశాడో ఆయన మాటల్లోనే చూద్దాం... 


Related Post

సినిమా స‌మీక్ష