పవర్ స్టార్ తర్వాత రవితేజ..?

April 20, 2021


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు డైరక్టర్ హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ తర్వాత ఇన్నాళ్లకు పవర్ స్టార్ తో మరో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నాడు హరీష్ శంకర్. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సాగర్ చంద్ర మూవీతో పాటుగా క్రిష్ మూవీ హరి హర వీరమల్లు సినిమాలు పూర్తి కాగానే హరీష్ శంకర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో పవర్ స్టార్ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ మాస్ మహరాజ్ రవితేజ తో సినిమా ఓకే చేసుకున్నట్టు తెలుస్తుంది. హరీష్ శంకర్ కు డైరక్టర్ గా మొదటి ఛాన్స్ ఇచ్చిన హీరో రవితేజ. షాక్ తో మొదటి సినిమా షాక్ తగిలినా మళ్లీ హరీష్ టాలెంట్ నమ్మి మిరపకాయ్ ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అవడంతో హరీష్ శంకర్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు.Related Post

సినిమా స‌మీక్ష