వర్మ 'క్లైమాక్స్' రిలీజ్ డేట్ ఫిక్స్.. టికెట్ రేటు కూడా..!

May 29, 2020


img

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ టైంలో రెండు షాకులు ఇచ్చాడు. అందులో ఒకటి క్లైమాక్స్ మూవీ కాగా మరోటి కరోనా వైరస్. ఈ రెండు సినిమాలు ఎప్పుడు తీశాడో ఎలా తీశాడో తెలియదు కానీ వర్మ ఇచ్చిన షాక్ అందరిని అవాక్కయ్యేలా చేసింది. మియా మాల్కోవాతో చేసిన క్లైమాక్స్ సినిమా జూన్ 6న రిలీజ్ చేస్తున్నాడు ఆర్జీవీ. ఈ సినిమాను ఆర్జీవీ వరల్డ్ ఓటిటిలో రిలీజ్ చేస్తున్నాడు. పే పర్ వ్యూ కింద క్లైమాక్స్ సినిమా ఒకసారి చూసేందుకు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.   

మాములుగా థియేటర్ లో ఒక్కరు సినిమా చూడాలంటే సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలు పెట్టాల్సిందే. అదే టికెట్ ప్రైస్ తో ఆర్జీవీ క్లైమాక్స్ సినిమా చూపిస్తున్నాడు. అయితే అది ఒక్కరు చూస్తారా ఫ్యామిలీ మొత్తం కలిసి చూస్తారా అన్నది వాళ్ళిష్టం. అయితే క్లైమాక్స్ సినిమా ఫ్యామిలీ మొత్తంతో చూడటానికి కొద్దిగా ఇబ్బంది పడటం గ్యారెంటీ. ఇదే కాదు ఇక మీదట ఆర్జీవీ తీసే సినిమాలన్నీ ఇలా ఆర్జీవీ వరల్డ్ ఓటిటిలోనే రిలీజ్ చేస్తాడని తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష