అల వైకుంఠపురములో డిజిటల్ రైట్స్ వారికే..!

December 07, 2019


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న అల వైకుంఠపురములో సినిమా జనవరి 12న రిలీజ్ ఫైనల్ చేశారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన 3 సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే హిరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై హ్బారీ అంచనాలు ఉన్నాయి. 

అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా బన్ని, త్రివిక్రమ్ కాంబో మీద నమ్మకంతో ఈ సినిమాకు భారీ బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే శాటిలైట్ రైట్స్ ప్రముఖ ఛానెల్ సొంతం చేసుకోగా డిజిటల్ రైట్స్ విదేశీ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. అల వైకుంఠపురములో డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ వారు భారీగానే ఇచ్చారట. సినిమాకు ఉన్న బజ్ ఆల్రెడీ రెండు హిట్లు కొట్టిన కాంబినేషన్ కాబట్టి ఈ మూవీ పక్కా హిట్ అనేస్తున్నారు. మరి అల వైకుంఠపురములో అనుకునే రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి.   



Related Post

సినిమా స‌మీక్ష