అమెజాన్ ప్రైమ్ లో కెజిఎఫ్ రికార్డ్..!

December 07, 2019


img

కన్నడలో తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. కేవలం శాండల్ వుడ్ లోనే కాదు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా కెజిఎఫ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. అంతకుముందు ఎవరో కూడా తెలియని కెజిఎఫ్ స్టార్ యష్ ఇప్పుడు సౌత్ క్రేజీ స్టార్ అయ్యాడు. సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కు మంచి క్రేజ్ వచ్చింది. 

రిలీజై సంవత్సరం అవుతున్నా ఇప్పటికి కెజిఎఫ్ రికార్డులు కొడుతూనే ఉంది. వెండితెర మీదే కాదు డిజిటల్ ఫ్లాట్ ఫాంలో కూడా కెజిఎఫ్ సంచలన విజయం అందుకుంది. అమెజాన్ ప్రైమ్ లో కెజిఎఫ్ అరుదైన రికార్డ్ సాధించింది. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా కూడా సాధించలేని రికార్డ్ ఈ మూవీ అందుకుంది. అమెజాన్ ప్రైమ్ లో కెజిఎఫ్ అదిరిపోయే వ్యూస్ సాధించిందని తెలుస్తుంది. 

కెజిఎఫ్ సక్సెస్ అవడంతో ఈ సినిమా సీక్వల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2020 సమ్మర్ లో కెజిఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అవుతుంది. ఈ సీక్వల్ లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. కెజిఎఫ్ 1 సూపర్ హిట్ అవగా కెజిఎఫ్ చాప్టర్ 2 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష