అదేంటి మెగాస్టార్ చిరంజీవి తర్వాత తండ్రి వారసత్వంగా సూపర్ హీరో క్రేజ్ తో పాటుగా మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ అభిమానులను అలరిస్తున్నాడుగా అనుకోవచ్చు. రామ్ చరణ్ చిరు పర్ఫెక్ట్ వారసుడే కాని ఒక విషయంలో మాత్రం సాయి తేజ్ లో చిరు లక్షణాలు ఉన్నాయని అన్నారు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్.
సాయి తేజ్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ప్రతిరోజు పండుగే. ఈ సినిమాను బన్ని వాసు నిర్మించగా అల్లు అరవింద్ సమాపకుడిగా ఉంటున్నారు. సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సినిమాలో హీరో పాత్రతో పాటుగా అవతల పాత్రలకు స్కోప్ ఇవ్వడం మెగాస్టార్ తర్వాత సాయి తేజ్ అన్నారు అల్లు అరవింద్. మరి మిగతా మెగా హీరోలు ఏమనుకుంటారో అనే ఆలోచన లేకుండా అల్లు అరవింద్ సాయి తేజ్ ని పొగిడారు. డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్ను ప్రతిరోజు పండుగే సినిమా తేజ్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.