ఎన్టీఆర్ తో తరుణ్ భాస్కర్..?

October 17, 2019


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం RRR మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత తారక్ త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇదిలాఉంటే యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఎన్.టి.ఆర్ కు ఓ లైన్ చెప్పాడని టాక్. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో దర్శకుడిగా తన సత్తా చాటిన తరుణ్ భాస్కర్ ప్రస్తుతం హీరోగా మీకు మాత్రమే చెప్తా సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమాను నిర్మించాడు.

ఈ మూవీ తర్వాత తరుణ్ భాస్కర్ మళ్లీ మెగా ఫోన్ పట్టుకోనున్నాడట. ఆల్రెడీ విక్టరీ వెంకటేష్ తో ఓ సినిమా కన్ఫాం అయినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ బయటకు వస్తుందట. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. తారక్ కు లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాడట తరుణ్ భాస్కర్. ఆర్.ఆర్.ఆర్ తర్వాత త్రివిక్రం సినిమా పూర్తయ్యేలోపు తరుణ్ తను రాసిన బౌండెడ్ స్క్రిప్ట్ తో ఎన్.టి.ఆర్ ను కలుస్తాడట. అది నచ్చితే తరుణ్ భాస్కర్ తో సినిమా కన్ ఫాం అయినట్టే లెక్క.   



Related Post

సినిమా స‌మీక్ష