బాహుబలి నిర్మాతల భారీ స్కెచ్..!

February 16, 2019


img

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి అతనికి కావాల్సిన బడ్జెట్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన ఆర్కా నిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. బాహుబలి తర్వాత వారు మరో మూవీ చేయలేదు. అయితే వారి చూపు డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద పడ్డదట. ప్రస్తుతం అందరు అమేజాన్, నెటి ఫ్లిక్స్ ఇలా ఆన్ లైన్ లోనే ప్రయోగాలు చేస్తున్నారు. సినిమాగా కాకుండా వెబ్ సీరీస్ పేరుతో కొత్త ఒరవడి సృష్టించారు.

ప్రస్తుతం బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కూడా ఈ వెబ్ సీరీస్ లను తీసే ప్రయత్నాల్లో ఉన్నారట. వెబ్ సీరీస్ అంటే అలాంటిలాంటివి కాదు భారీ హంగులతో కొత్త ఆలోచనలతో వీటిని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఇప్పటికే డైరక్టర్స్, స్టోరీ రైట్స్ ను జల్లెడ పడుతున్నారట. మొత్తానికి ఆర్కా మీడియా ఈ విధంగా తెలుగు పరిశ్రమలో ఓ కొత్త ట్రెండ్ సృష్టించాలని చూస్తున్నారు. అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.   



Related Post

సినిమా స‌మీక్ష