రాం చరణ్ ను దాటేసిన దేవరకొండ..!

November 15, 2018


img

యువ హీరోల్లో మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్ని వాసు నిర్మించిన ఈ సినిమాతో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇక ఈ సినిమా బుల్లితెరపై కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. జీ తెలుగులో లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన గీతా గోవిందం సినిమా 20.7 టి.ఆరి.పి రేటింగ్ తెచ్చుకుందట.

రాం చరణ్ నటించిన రంగస్థలం సినిమా స్టార్ మాలో మొదటిసారి టెలికాస్ట్ అయ్యి 19.5 రేటింగ్ తెచ్చుకుంది. గీతా గోవిందం కన్నా రంగస్థలం సినిమాకు తక్కువ రేటింగ్ వచ్చింది. అందుకే రాం చరణ్ కు బుల్లితెర టి.ఆర్.పి రేటింగులలో విజయ్ దేవరకొండ దాటేశాడని అంటున్నారు. అయితే రంగస్థలం సినిమా థియేటర్ ఆడుతున్న టైంలోనే అమేజాన్ ప్రైం ఆన్ లైన్ లో రిలీజ్ చేసింది. అందుకే రంగస్థలం బుల్లితెర మీద అంత సందడి చేయలేదు.  



Related Post

సినిమా స‌మీక్ష