కొక్కొరొకో కోడి పాటతో కళ్యాణ్ దేవ్..!

June 22, 2018


img

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా వస్తున్న కళ్యాణ్ దేవ్ రాకేష్ శషి డైరక్షన్ లో విజేత మూవీ చేస్తున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ కొక్కొరొకో కోడి సాంగ్ రిలీజ్ చేశారు. కోడి కర్రీ రకాల గురించి పాటలో భలేగా చెప్పారు. కళ్యాణ్ దేవ్ ఈ పాటలో మంచి ఈజ్ తో కనిపించాడు.

హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఈ కోడి పాట సిని లవర్ ను అలరిస్తుంది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ సినిమాకు స్పెషల్ క్రేజ్ వచ్చింది. మరి కళ్యాణ్ దేవ్ తొలి ప్రయత్నంగా వస్తున్న ఈ విజేత విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కళ్యాణ్ దేవ్ కూడా మెగా అభిమానులను అలరించేలా యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. 





Related Post

సినిమా స‌మీక్ష