బిగ్ బాస్-2 భలే షాక్ ఇచ్చారు..!

June 18, 2018


img

స్టార్ మాలో బిగ్ బాస్ సెకండ్ సీజన్ మొదలైంది. నాని హోస్ట్ గా చేస్తున్న ఈ రియాలిటీ షోలో మొదటి వారం ఆడియెన్స్ ఊహలకు అందకుండా ఎలిమినేషన్ జరిగింది. నూతన్ నాయుడు, సంజనాలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పగా కొద్దిపాటి నాటకీయ పరిణామాలతో ఫైనల్ గా సంజనాని బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు పంపించారు. నూతన్ నాయుడు సేఫ్ అయ్యాడు.

సంజనా తను చూపించిన యాటిట్యూడ్ వల్ల బిగ్ బాస్ హౌజ్ నుండి మొదటి వారమే బయటకు వచ్చేసిందని అంటున్నారు. అంతేకాదు సెలబ్రిటీస్, కామన్ మెన్ ను తొక్కేస్తున్నారని ఆమె వివాదం మొదలుపెట్టింది. హౌజ్ లో ఉంటే ఇంకెంత గొడవలు చేస్తుందో అని ఆమెను ఎలిమినేట్ చేశారు. సంజనా అలా వెళ్లిందో లేదో మరో కంటెస్టంట్ నందినిని హౌజ్ లోకి పంపాడు నాని. మొత్తానికి బిగ్ బాస్ ఆడియెన్స్ కు భలే షాక్ ఇచ్చాడు.  



Related Post

సినిమా స‌మీక్ష