ఛల్ మోహన్ రంగ రివ్యూ & రేటింగ్

April 05, 2018


img

రేటింగ్ : 2.25/5

కథ :

జీవితంలో ఓ లక్ష్యం అంటూ లేని ఓ మోహన్ రంగ (నితిన్) తన స్నేహితురాలు యూఎస్ వెళ్లిందని తెలుసుకుని అక్కడకు వెళ్లాలని ఫిక్స్ అవుతాడు. మనవాడి మార్కులకు వీసా మూడు సార్లు రిజెక్ట్ అవుతుంది. ఎలాగోలా యూఎస్ చేరుకున్న మోహన్ రంగ అక్కడ మేఘా సుబ్రమణ్యం (మేఘా ఆకాష్)ను చూసి ఇష్టపడతాడు. ఇద్దరు ప్రయాణంలో ఒకరికొకరు నచ్చుతారు అయితే అది చెప్పే టైం కు వారి నిర్ణయం సరైనదా కాదా అన్న కన్ ఫ్యూజన్ లో విడిపోతారు. ఫైనల్ గా మోహన్ రంగ మేఘాని కలిశాడా లేడా అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

త్రివిక్రం సినిమాల కథల్లానే రొటీన్ గానే ఈ సినిమా కథ ఉంటుంది. కథ అందించిన త్రివిక్రం ఎక్కడ తన మార్క్ చూపించలేదు. అయితే కథనం కొంత మేరకు రిఫ్రెషింగ్ గా ఉంది. మాటలు బాగా రాసుకున్నారు. సినిమా అంతా విజువల్ ట్రీట్ గా కలర్ ఫుల్ గా రిచ్ లొకేషన్స్ లో షూట్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఫన్ గా సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగుతుంది.

సినిమా అంతా కథ కథనాల్లో కొత్తదనం అనిపించదు కాని ఎక్కడ బోర్ కొడుతున్న ఫీలింగ్ కూడా రాదు. అయితే ఇదే కథను ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తీసుంటే బాగుండేది. కథలో, కథనంలో ఎలాంటి కొత్తదనం లేకున్నా సరే సినిమా అలా కామెడీగా నడుస్తుంది. 

లీడ్ పెయిర్ మీదే సినిమాలో ఎక్కువ సీన్స్ ఉంటాయి. అయితే వారి కెమిస్ట్రీ బాగానే వర్క్ అవుట్ అయినట్టు తెలుస్తుంది. సెకండ్ హాఫ్ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. సినిమా అంతా ఫన్ ఎలిమెంట్ గానే ట్రీట్ చేశాడు దర్శకుడు.

నటన, సాంకేతికవర్గం :

నితిన్ నటన పరంగా మెరుగుపరచుకున్నాడు. లవర్ బోయ్ గా ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. మేఘా ఆకాష్ లుక్స్ బ్యూటిఫుల్. క్లైమక్స్ లో బాగా నటించింది. కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. ఇక సినిమాలో ముఖ్య తారాగణంగా నటించిన మధు నందన్, ప్రభాస్ శ్రీను, సత్య, రావు రమేష్, సీనియర్ నరేష్ ఇలా అందరు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే..  నటనరాజన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ బాగుంది. న్యూ యార్క్ లొకేషన్స్ అన్ని బాగా చూపించారు. తమన్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. త్రివిక్రం కథ పాతదే. దానికి దర్శకుడు కృష్ణ చైతన్య కథనం కూడా రొటీన్ గానే సాగింది. అయితే ఎక్కడ బోర్ అన్నది కొట్టలేదు. ఎడిటింగ్ ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో :

ఛలో మోహన్ రంగ.. రొటీన్ గానే వచ్చిన రంగా..!



Related Post

సినిమా స‌మీక్ష