హైదరాబాద్‌ మెట్రో అర్ధ సం నష్టాలు రూ. 405 కోట్లు!

October 18, 2026


img

హైదరాబాద్‌ మెట్రో నష్టాల ఊబిలో కూరుకుపోవడంతో ఎల్&టి కంపెనీ చేతులెత్తేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ మెట్రో బకాయిలు తీర్చి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. కానీ గత ఆర్ధిక సంవత్సరం సెప్టెంబర్ 30 నాటికి రూ.380.46 కోట్లు నష్టం రాగా, ఈ ఏడాది రూ.405.86 కోట్లు నష్టం వచ్చినట్లు ప్రకటించింది. 

మెట్రో నిర్మాణానికి, నిర్వహణ ఖర్చుల కోసం చేసిన అప్పులు, వాటిపై వడ్డీల భారమే ఈ నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. రుణాలపై సగటున 7 నుంచి 8 శాతం వడ్డీలు చెల్లిస్తోంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకొని వాటితో పాత రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. 

కానీ మెట్రో ఇంకా పూర్తిగా ప్రభుత్వ స్వాధీనం కాకముందే అర్ధ సంవత్సరంలోనే రూ.405.86 కోట్లు నష్టం రావడం చాలా పెద్ద ఎదురుదెబ్బే. ఉన్న అప్పులు, వడ్డీలకు తోడూ ఇలా నష్టాలు కూడా పేరుకుపోతుంటే, హైదరాబాద్‌ మెట్రోని ప్రభుత్వమైనా ఎలా కాపాడగలదు?కాపాడలేకపోతే మెట్రో పరిస్థితి ఏమిటి?అనే ఆలోచన ఆందోళన కలిగిస్తుంది.


Related Post