నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన

October 18, 2026


img

ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర ఉష్ణోగ్రతలు, నీటి కొరతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త ఇది. అదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలో హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది.

రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో అదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలియజేసింది. 

మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు, జనగామ, వరంగల్‌, హనుమకొండ, వికారాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మిగిలిన అన్ని జిల్లాలో చిరుజల్లులు కురుస్తాయని తెలియజేసింది. 

వర్షాభావ పరిస్థితి కారణంగా బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు కూడా చెరువులలో నీళ్ళు లేని పరిస్థితి. కానీ నేడు సద్దుల బతుకమ్మ నిమజ్జనం కొరకు అమ్మవారే ఈ వర్షాలు కురిపిస్తున్నారనిపిస్తుంది. 


Related Post