ప్రతీరోజూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే హైదరాబాద్ మెట్రోలో అప్పుడప్పుడు నగరంలో ఒక చోట నుంచి మరో చోటికి దాతల నుంచి సేకరించిన అవయవాలు గ్రీన్ ఛానల్ ద్వారా తరలిస్తుంటారు. నేడు అదేవిధంగా గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసపత్రికి వైద్య బృందం గుండె, ఊపిరితిత్తులు సురక్షితంగా తీసుకువెళ్ళారు.
మెట్రో గ్రీన్ ఛానల్ ద్వారా 14 కిమీ దూరంలో ఉన్న కిమ్స్ ఆస్పత్రికి కేవలం 25 నిమిషాలలోనే చేర్చగలిగారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్య బృందం వెంటనే వాటిని రోగికి అమర్చారు. ఈ శస్త్ర చికిత్స విజయవంతంమైందని వైద్యులు ప్రకటించారు.
అదే.. రోడ్డు మార్గాన్న గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినా గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసపత్రికి చేరుకోవడానికి కనీసం 45 నిమిషాలు పైనే పడుతుంది. దాత శరీరం నుంచి సేకరించినప్పటి నుంచి ప్రతీ క్షణం చాలా అమూల్యమైనదే. కనుక హైదరాబాద్ మెట్రో ఈవిధంగా కూడా రోగుల ప్రాణాలు కాపాడేందుకు యధాశక్తిన తోడ్పడుతుండటం చాలా అభినందనీయం.