పోలీస్ శాఖలో ఉద్యోగ దరఖాస్తులకు డేట్ ఫిక్స్

August 01, 2026


img

పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఇటీవల పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. వాటికి ఆగస్ట్ 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్‌ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే తప్పనిసరిగా బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ www.tgprb.in ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. వేరేవిధంగా స్వీకరించబోమని బోర్డు చైర్మన్‌ వివి.శ్రీనివాస రావు స్పష్టం చేశారు. 

ప్రాధమిక పరీక్ష మొదలు తుది పరీక్ష వరకు అన్నిటికీ కలిపి ఒక్కసారి దరఖాస్తు రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఎస్సై, సబ్ ఇన్‌స్పెక్టర్, జైలర్ తదితర పోస్టులకు స్థానిక ఎస్సీ,ఎస్టీ అభ్యర్ధులకు రూ.750, ఇతర అభ్యర్ధులందరికీ రూ. 1500 గా నిర్ణయించారు. 

కానిస్టేబుల్, డ్రైవర్ తదితర పోస్టులకు స్థానిక ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు రూ. 600, ఇతర అభ్యర్ధులందరికీ రూ.1,200గా నిర్ణయించారు.   

పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 3,697 పోస్టులు,

ఆర్మ్ రిజర్వ్ కానిస్టేబుల్: 1,052 పోస్టులు, 

సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్): 148 పోస్టులు, 

సబ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్మ్ రిజర్వ్):14 పోస్టులు, 

రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (టీజీఎస్పీ): 12 పోస్టులు, 

సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్ సిపీఎల్): 3 పోస్టులు, 

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎఫ్‌పీబీ): 23 పోస్టులు, 

పోలీస్ కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్): 24 పోస్టులు, 

పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్-పీటీవో): 20 పోస్టులు, 

మెకానిక్ పీటీవో: 7 పోస్టులు.


Related Post