తెలంగాణలో 7,437 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ

July 30, 2026


img

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శరవేగంగా ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. తాజాగా పోలీస్, స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్, అగ్నిమాపక మరియు జైళ్ళ శాఖలో మొత్తం 7,437 పోస్టులు భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బుదవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటిలో అత్యధికంగా కానిస్టేబుల్.. స్థాయి పోస్టులే ఉన్నందున కనీస విద్యార్హత కలిగిన వారికి ఇది ఓ చక్కటి అవకాశంగా భావించవచ్చు. 

అన్ని పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ www.tgprb.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దానిలో సూచించిన విధంగా వయసు, ఎత్తు, బరువు, ధ్రువపత్రాలు వగైరా అన్ని సరిచూసుకున్నాకనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 

పోలీస్ శాఖలో భర్తీ చేయబోతున్న పోస్టులు:  

సివిల్ కానిస్టేబుల్: 3,697, ఏఆర్ కానిస్టేబుల్: 1,052, ఎస్ఎఆర్ సీపీఎల్ కానిస్టేబుల్: 24, కానిస్టేబుల్ (డ్రైవర్) పీటీవో: 20, కానిస్టేబుల్ (మెకానిక్) పీటీవో: 7, సివిల్ ఎస్సై: 148, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై: 23, ఏఆర్ ఎస్సై: 14, టీజీఎస్పీ ఏఆర్ ఎస్సై: 12, ఎస్ఎఆర్ సీపీఎల్ ఎస్సై:  3. 

స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్: కానిస్టేబుల్: 1,380, ఎస్సై: 44. 

అగ్నిమాపక శాఖ: స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 39. ఫైర్ ఫైటర్స్: 751. 

జైళ్ళ శాఖ: డిప్యూటీ జైలర్ (పురుషులు): 14, డిప్యూటీ జైలర్ (మహిళలు):1 , వార్డర్ (పురుషులు):196, వార్డర్ (మహిళలు):12. 


Related Post