పదో తరగతి పరీక్షా ఫలితాలు రేపే!

April 28, 2026


img

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వ్రాసి హాయిగా సెలవులు ఎంజాయ్ చేసిన విద్యార్ధులకు టెన్షన్ మొదలైనట్లే. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెలువడతాయి. ఈ నెల 13 పరీక్షలు ముగిసిన వెంటనే విద్యాశాఖ మూల్యాంకనం మొదలుపెట్టి మే మొదటి వారంలోగా పూర్తిచేయాలనుకుంది. కానీ పది రోజుల్లోనే శరవేగంగా పూర్తి చేసింది. మొత్తం 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు వ్రాశారు. ఫలితాలు ప్రకటించగానే బెటర్మెంట్, సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకటించనున్నారు. 

పదో తరగతి తర్వాత సాధారణంగా చాలా మంది విద్యార్ధులు ఇంటర్లో ఏదో ఓ గ్రూప్ ఎంచుకొని చేరుతుంటారు. ఇప్పుడు రకరకాల ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. కనుక గుడ్డిగా ఇంజనీరింగ్, డాక్టర్ అని ఏదో ఓ గ్రూప్‌లో చేరిపోకుండా భవిష్యత్‌లో ఎటువంటి ఉద్యోగం, ఉపాధిలోకి వెళ్ళాలనుకుంటున్నారో లేదా దేనిలో అవకాశాలు ఎక్కువున్నాయో తెలుసుకొని చేరడం మంచిది. 

ఆర్ధిక పరిస్థితిని బట్టి ఇంటర్ ఒకేషనల్ కోర్సులు ఎంచుకోవచ్చు లేదా ఇంటర్ బదులు ఐటిఐలో అనేక సాంకేతిక కోర్సులలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువున ఏదైనా కోర్సు ఎంచుకొని దేనిలోనైనా చేరవచ్చు. 


Related Post