చైనా నౌకల జోలికి రావద్దు: బీజింగ్

April 14, 2026


img

అమెరికా-ఇరాన్‌ చర్చలు విఫలం కావడంతో మండిపడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, హోర్మూజ్ జలసంధి గుండా ఇరాన్‌కు రాకపోకలు సాగిస్తున్న చమురు, గ్యాస్, సరుకు రవాణా నౌకలపై ఆంక్షలు విధించారు.

ట్రంప్‌ ఆదేశం మేరకు అమెరికా యుద్ధ నౌకలు హోర్మూజ్ జలసంధి గుండా  ఇరాన్‌కు రాకపోకలు సాగిస్తున్న చమురు, గ్యాస్, సరుకు రవాణా నౌకలను అడ్డుకుంటున్నాయి.

దీనిపై చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ స్పందిస్తూ, “చైనా-ఇరాన్‌ మద్య ద్విపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా మేము ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాము. దీనిలో మూడో దేశం ( అమెరికా) ప్రమేయం లేదు. కనుక మా నౌకలను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని సూచిస్తున్నాము,” అని అన్నారు. 

హోర్మూజ్ జలసంధి ఇరాన్‌ అధీనంలో ఉందని కనుక దానికి అమెరికా ఆటంకం కలిగించడం సరికాదన్నారు. ట్రంప్‌ దుందుడుకు, అనాలోచిత నిర్ణయాల వలన అమెరికాతో సహా యావత్ ప్రపంచ దేశాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి.

కానీ పిల్లి మెడలో గంటెవరు కడతారన్నట్లు, ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచ దేశాలు ఏవీ ట్రంప్‌ని కట్టడి చేయలేకపోతున్నాయి. కనుక ట్రంప్‌ నానాటికీ ఇలా రేచ్చిపోతూనే ఉన్నారు. ఏదో రోజు ఆయనకు జ్ఞానోదయం కలిగి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు ఉపసంహరించినట్లు ఇరాన్‌ నుంచి కూడా ఉపసంహరిస్తేనే మళ్ళీ ప్రపంచ శాంతి ఏర్పడుతుంది. అంతవరకు ట్రంప్‌ని భరించాల్సిందే! 



Related Post