రెండు తెలుగు రాష్ట్రాలకు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభం అయ్యాయి. అస్సాంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం కామాఖ్య నుంచి ఏపీ మీదుగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ వరకు ఈ ట్రైన్ రాకపోకలు సాగిస్తుంది.
ప్రధాని మోడీ నేడు అస్సాంలో ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను పచ్చ జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు. దీనిలో స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తక్కువ చార్జీతో అస్సాం వరకు వెళ్ళి రావడానికి ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ బాగా ఉపయోగపడుతుంది.
ప్రస్తుతానికి దీనికి తెలంగాణలో చర్లపల్లి తర్వాత నల్గొండలో మాత్రమే హాల్ట్ ఉంది. భవిష్యత్‌లో డిమాండ్ బట్టి మరికొన్ని స్టేషన్లలో హాల్ట్ ఈయవచ్చు.
చర్లపల్లి, నల్గొండ, ఏపీలో గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, రాజమహేంద్రవరం, సామర్లకోట జంక్షన్, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్ స్టేషన్లలో దీనికి హాల్టింగ్ ఉంది.