వైవాహిక బంధంలో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ, రష్మిక మందనల సంతోషానికి భంగం కలిగిస్తూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ పాత వీడియో దానిపై రకరకాలా కామెంట్స్ వచ్చాయి. ఇంతకాలం ఇలాంటివి పట్టించుకోని రష్మిక మందన తొలిసారిగా చాలా ఘాటుగా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పెద్ద మెసేజ్ పెట్టారు.
గత 8 ఏళ్ళుగా మీడియాలో ఒక వర్గం నన్ను టార్గెట్ చేసుకొని ఎంతగా వేధిస్తున్నా సెలబ్రెటీలకు ఇలాంటి సమస్యలు తప్పవని మౌనంగా భరిస్తున్నా. నా మాటలను వక్రీకరించి నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నా ఓపికగా భరించాను.
కానీ ఇప్పుడు 8 ఏళ్ళ క్రితం నాటి ఓ పాత వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో పెట్టి నాకు, నా కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. మీరు మీ లైక్స్, వ్యూస్ కోసం మా జీవితాలలో ఆడుకుంటామంటే సహించే ప్రసక్తే లేదు. కనుక 24 గంటలలో ఆ వీడియోతో పాటు మొత్తం అన్నిటినీ తీసేయాలి. లేకుంటే లీగల్ యాక్షన్ తప్పదు,” అని ఆ లేఖలో హెచ్చరించారు.
ఆమె ఇంగ్లీషుతో పాటు కన్నడలో కూడా ఓ కాపీ పోస్ట్ చేసినందున కన్నడ మీడియా, కన్నడ సోషల్ మీడియాకు ప్రత్యేకంగా ఈ హెచ్చరిక చేసినట్లు భావించవచ్చు.
— Rashmika Mandanna (@iamRashmika) March 12, 2026