23 ఏళ్ళు పోరాడినా ప్రత్యూషకు న్యాయం జరగలేదు!

February 17, 2026


img

నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు నేడు వెలువరించిన తుది తీర్పుపై ఆమె తల్లి సరోజిని స్పందిస్తూ, “నా కూతురు ప్రతూషపై అత్యాచారం చేసి హత్య చేసిన నేరస్తుడు (సిద్ధార్థ రెడ్డి) జీవిత ఖైదు విధించాలని నేను 23 ఏళ్ళుగా న్యాయపోరాటం చేస్తున్నాను. కానీ కేవలం రెండేళ్ళ జైలు శిక్షతో తప్పించుకుంటున్నాడు.

అప్పుడే సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ మునుస్వామి కమీషన్ విచారణ జరిపి ప్రత్యూషపై అత్యాచారం జరిపి హత్య చేసినట్లు నివేదికలో పేర్కొంది. కానీ ఆ నివేదికని ఎందుకు పక్కన పెట్టిందో తెలీదు. ఇన్నేళ్ళు పోరాడినా నా కూతురుకి న్యాయం జరగలేదు. కానీ సుప్రీం కోర్టు తీర్పుని గౌరవిస్తాను,” అని సరోజిని అన్నారు. 

ప్రత్యూష మృతి కేసులో ఆమె విషం కలిపినా కూల్ డ్రింకు త్రాగి ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొల్పినందుకు, సిద్ధార్ధ రెడ్డి కూడా తాగి ఆత్మహత్యాయత్నం చేసుకునందుకు మాత్రమే తెలంగాణ హైకోర్టు రెండేళ్ళు జైలు శిక్ష, రూ.50,000 జరిమానా విధించింది. దానినే సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. 

(video courtesy: Telugu Popular TV)


Related Post