తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ జాగృతి తరపున 10 మంది అభ్యర్ధులు గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ జెండాతో పోటీ చేశారు. వారిలో 8 మంది గెలవడంతో ఆ మున్సిపాలిటీ జాగృతి సొంతమైంది. కనుక తమ ఈ తొలి విజయం గురించి కల్వకుంట్ల కవిత మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు సిద్ధమవుతుంటే, గెలిచిన 8 మంది వార్డు మెంబర్ల తరపున వడ్డేపల్లి శ్రీనివాస్ ఆమెకు పెద్ద షాక్ ఇచ్చారు.
“మా 8 మందికి తెలంగాణ జాగృతితో సంబందం లేదు. మేము ఫార్వార్డ్ బ్లాక్ పార్టీలో ఉన్నాము. మా పార్టీ తరపునే పోటీ చేసి గెలిచాము,” అని చెప్పారు.
బహుశః కల్వకుంట్ల కవిత ఇలాంటి షాక్ ఊహించి ఉండరు. వడ్డేపల్లి శ్రీనివాస్ చేసిన ఈ ప్రకటనపై ఆమె ఇంకా స్పందించాల్సి ఉంది.