మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: దూసుకుపోతున్న కాంగ్రెస్‌ పార్టీ

February 13, 2026


img

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమై మూడు గంటలైంది. కనుక అప్పుడే ఫలితాలు వస్తున్నాయి. ఉదయం 11.00 వరకు ప్రకటించిన ఫలితాలలో కాంగ్రెస్‌ పార్టీ: 438 వార్డులు, బీఆర్ఎస్‌: 209, బిజేపి:62, ఇతరులు: 58 వార్డులు దక్కించుకున్నారు. 

మున్సిపల్ ఎన్నికలలో ఊహించినట్లే కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోతున్నప్పటికీ, బీఆర్ఎస్‌ పార్టీ రెండో స్థానంలో నిలుస్తూ ఎప్పటిలాగే బిజేపిని మూడో స్థానానికి పరిమితం చేసింది. 

అశ్వారావు పేట, ధర్మపురి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, హుజురాబాద్, చొప్పదండి, సుల్తానాబాద్, మందని, నారాయణపేట, సదాశివపేట, హుజూర్ నగర్‌, కోదాడ,నేరేడుచర్ల, మధిర, కొల్లాపూర్ తదితర మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంది. 

జోగులాంబ గద్వాల్ జిల్లాలో అయిజ మున్సిపాలిటీలో 20 స్థానాలలో బీఆర్ఎస్‌ 13, కాంగ్రెస్‌: 7 గెలుచుకున్నాయి.

సంగారెడ్డి జిల్లాలో గడ్డిపోతారం మున్సిపాలిటీలో 18 స్థానాలలో బీఆర్ఎస్‌ 14, కాంగ్రెస్‌: 3 గెలుచుకున్నాయి. 

జనగామ జిల్లాలో జనగామ మున్సిపాలిటీలో 30 స్థానాలలో కాంగ్రెస్‌: 9, బీఆర్ఎస్‌: 7, స్టేషన్ ఘన్‌పూర్: కాంగ్రెస్‌: 10, బీఆర్ఎస్‌: 2 గెలుచుకున్నాయి. 


Related Post