ఆపరేషన్ చాణక్య: కాంగ్రెస్‌ గెలుపు తధ్యం

February 12, 2026


img

బుధవారం సాయంత్రం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఫలితాలపై ముందస్తు అంచనాలు ప్రకటించింది. 

ఏడు కార్పోరేషన్లలో కాంగ్రెస్‌ పార్టీ నల్గొండ, మహబూబ్‌నగర్‌, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలో గెలుచుకుంటుందని, కరీంనగర్‌, నిజామాబాద్‌ మున్సిపల్ కార్పోరేషన్లు బిజేపి దక్కించుకునే అవకాశం ఉందని తెలిపింది. 

తెలంగాణలో 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్‌ పార్టీ 1210-1290 వార్డులు, బీఆర్ఎస్‌ పార్టీ 860-930, బిజేపి 250-270, మజ్లీస్ 35-44, సీపీఐ 12-17, సీపీగాఎం 10-14, ఇతరులు 90-110 వార్డులు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. 

ఆపరేషన్ చాణక్య సర్వే కూడా కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందని, బీఆర్ఎస్‌, బిజేపిలు రెండు మూడు స్థానాలలో నిలుస్తాయని పేర్కొంది. 

ఆపరేషన్ చాణక్య సర్వే ప్రకారం కాంగ్రెస్‌: 1400-1149, బీఆర్ఎస్‌: 745-793, బిజేపి:358-399, మజ్లీస్:150-187, జనసేన: 30-35 వార్డులు దక్కించుకుంటాయి. 

ఈ ప్రకారం ప్రకారం కాంగ్రెస్‌: 48.06 శాతం, బీఆర్ఎస్‌: 26.06, బిజేపి:13.04, మజ్లీస్:6.03, జనసేన:1.02, ఇతరులు:4 శాతం ఓట్లు లభిస్తాయి. 



Related Post