ఆ అమ్మ మామూలు అమ్మ కాదు!

February 07, 2026


img

ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం (వాలంటైన్స్ డే). ఆ రోజు కోసం ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాగే పబ్లిక్ పార్కులలో ప్రేమ జంటలు దొరికితే వారికి అక్కడే పెళ్ళి చేసేద్దామని భజరంగ్ దళ్ వగైరా హిందూ సంస్థల ప్రతినిధులు కూడా రెడీ అవుతున్నారు. అయితే వారందరి కంటే ఈ అమ్మ చాలా గ్రేట్! ప్రేమికుల దినోత్సవానికి ఇంకా వారం రోజులు ఉండగానే ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ప్లాట్ ఫారంపై కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న తన కొడుకు, అతని ప్రియురాలికి అక్కడికక్కడే వివాహ నిశ్చితార్ధం చేసేశారు!

తన కొడుకు ఓ అమ్మాయితో కలిసి తిరుగుతున్నాడని గ్రహించిన ఆ తల్లి ఈరోజు ఉదయం భర్తని, ఓ ఫోటో గ్రాఫర్‌ని వెంటబెట్టుకొని ఢిల్లీ మెట్రో స్టేషన్ చేరుకున్నారు. హటాత్తుగా ప్రత్యక్షమైన తల్లి తండ్రులను చూసి అబ్బాయి షాక్ అయ్యాడు. ఇక ఆ అమ్మాయి పరిస్థితి చెప్పక్కరలేదు. వారిద్దరూ ఆ షాక్ నుంచి తేరుకునేలోగానే, కాబోయే కోడలి నెత్తిన దుపట్టా వేసి, ఆమె చేతిలో చీర, కొబ్బరికాయ, పళ్ళు, పూలు, స్వీట్లు పెట్టారు. తర్వాత ఇద్దరికీ స్వీట్స్ తినిపించారు. తర్వాత వారిచేత కాళ్ళకు మొక్కించుకొని అక్షింతలు జల్లి శీర్వదించారు. వారిద్దరూ ఏం చెప్పాలో తెలీని పరిస్థితిలో ఆ తల్లి చకాచకా వారి వివాహ నిశితార్ధం కార్యక్రమం పూర్తి చేసేశారు. తర్వాత ఈ వీడియో రికార్డింగుని ఆ అమ్మాయి తల్లితండ్రులకు పంపించేశారు! 


Related Post