ఇటీవలే తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికలు దిగ్విజయంగా జరిగాయి. కనుక సంక్రాంతి పండుగ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు రూ.277 కోట్లు విడుదల చేసింది. అయితే ఇది పండుగ ఖర్చుల కోసం కాదు. గ్రామాభివృద్ధి పనులు, రోజువారి నిర్వహణ ఖర్చులు, ఇతర అవసరాల కోసమని స్పష్టం చేసింది.
ఇంతకాలం పంచాయితీ ఎన్నికలు జరుగకపోవడం వలన కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన గుట్టేదారులకు బిల్లులు చెల్లించలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ఈ పెండింగు బిల్లులు అన్నిటికీ ఒకేసారి చెల్లింపులు జరుగుతాయి.
సంక్రాంతి పండుగకు ముందు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.