తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సన్నాహాలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు ఓటర్ల తుది జాబితా ప్రకటించింది. దాని ప్రకారం రాష్ట్రంలో మొత్తం 52,43,023 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 25,62,369, మహిళలు 26,80,014 మంది, 640 ట్రాన్స్ జండర్స్ ఉన్నారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో అత్యధికంగా 3,48,051 భద్రాద్రి కొత్తగూడెం కార్పోరేషన్‌లో అత్యల్పంగా 1,34,655 మంది ఓటర్లున్నారు.
ఈ ఓటర్ల జాబితా ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్స్ ఖరారు చేయగానే ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటిస్తుంది. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.