ప్రమాదాలలో కాళ్ళు కోల్పోయిన నిరుపేదలు దుర్భర జీవితం అనుభవిస్తుంటారు. అటువంటి వారి కోసం ఆలయ ఫౌండేషన్ అధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీలలో వరంగల్‌లో కృత్రిమ కాళ్ళు పంపిణీ శిబిరం నిర్వహిస్తున్నారు. జైపూర్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ కృత్రిమ కాళ్ళని పూర్తి ఉచితంగా అందజేస్తారు. వరంగల్, కొత్తవాడలోని ఎంవీ కాలనీలో గల పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఈ కృత్రిమ కాళ్ళు పంపిణీ శిబిరం నిర్వహిస్తున్నారు. కనుక ఇవి అవసరమైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సంస్థ మార్గదర్శి శ్రీ పరికిపండ్ల నరహరి, ఐఏఎస్ విజ్ఞప్తి చేశారు. ఈ శిబిరం గురించి అవసరమున్నవారికి తెలియజేసి కూడా సాయపడవచ్చు.
ఈ శిభిరం పంపిణీ గురించి పూర్తి వివరాల కొరకు: 94901 33650, 99494 46802, 98859 81959, 70959 15728 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
<blockquote class="twitter-tweet"><p lang="te" dir="ltr">అవకాశం ఉన్నవారు దయచేసి వినియోగించుకోండి, తెలియని వారికి తెలియజేయండి.<a href="https://twitter.com/hashtag/camping?src=hash&ref_src=twsrc%5Etfw">#camping</a> <a href="https://t.co/gyQEPaLR9p">pic.twitter.com/gyQEPaLR9p</a></p>— Do Something For 👉Better Society ✊ (@ChitraR09535143) <a href="https://twitter.com/ChitraR09535143/status/1997163025946890390?ref_src=twsrc%5Etfw">December 6, 2025</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>