బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “బీసీలకు 42శాతం రిజర్వేషన్స్ ఇస్తామంటూ సిఎం రేవంత్ రెడ్డి చాలా హడావుడి చేశారు. దాని కోసం కుల గణన పేరుతో రూ. 160 కోట్లు ఖర్చు పెట్టారు కూడా.
కానీ పంచాయితీ ఎన్నికలలో కొన్ని మండలాలలో బీసీలకు 17 శాతం రిజర్వేషన్స్ మాత్రమే ఇచ్చారు. మరికొన్ని జిల్లాలలో బీసీల పేర్లే తొలగించేశారు. బీసీ రిజర్వేషన్స్ గురించి ఇన్ని ప్రగల్భాలు పలికి చివరికి 17 శాతం బీసీ రిజర్వేషన్స్‌తో సరిపెదతారా?
బీసీలను మోసం చేసినందుకు లెంపలు వేసుకొని వారిని క్షమాపణ చెప్పాలి. కానీ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇస్తామని మరో మోసం చేస్తున్నారు. పంచాయితీ ఎన్నికలకు రాజకీయ పార్టీల పరంగా జరగవు. మరి పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్స్ ఇస్తామని ఎలా చెపుతున్నారు? ఇది బీసీలను మోసం చేయడం కాదా?
మిమ్మల్ని ఇంతగా మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి పంచాయితీ ఎన్నికలలో గుణపాఠం చెప్పాలని బీసీలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ సూటిగానే అడిగారు. కనుక కాంగ్రెస్ పార్టీ కూడా సూటిగా సమాధానం చెపితే బాగుంటుంది.
(Video Courtesy: Telugu 360)