ప్రస్తుతం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మొదలు సామాన్యులు వరకు అయ్యప్ప దీక్ష స్వీకరించి, నియమ నిబందనలు పాటిస్తూ శబరిమలకు వెళ్ళివస్తున్నారు. కానీ పోలీస్ శాఖ అంటే ఖచ్చితమైన నియమ నిబందనలు పాటించాల్సి ఉంటుంది. వేసుకునే ఖాకీ యూనిఫారం, తలపై జుట్టు మొదలు కాలి బూట్ల వరకు వాటి ప్రకారం ఉండాల్సిందే. పోలీస్ శాఖకి ఇది అవసరం కూడా.
కానీ పోలీసులు, అధికారులు ఎవరైనా అయ్యప్ప దీక్ష తీసుకోవాలంటే? సెలవు పెట్టుకోవాల్సిందేనని హైదరాబాద్, సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ డిప్యూటీ కమీషనర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్, కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్.కృష్ణకాంత్ డ్యూటీ చేస్తూ అయ్యప్ప దీక్ష చేసేందుకు అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ వ్రాయగా, దానిపై స్పందిస్తూ డిప్యూటీ కమీషనర్ స్పష్టం చేశారు. ఒకవేళ అయ్యప్ప దీక్ష చేపట్టలనుకుంటే సెలవు పెట్టుకొని నిరభ్యంతరంగా చేసుకోవచ్చని లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు.