గ్రూప్-1 అర్హులకు హైకోర్టు దసరా గిఫ్ట్... అదిరిపోయిందిగా!

September 24, 2025


img

గ్రూప్-1లో అర్హత సాధించినప్పటికీ కోర్టు కేసు కారణంగా తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నవారికి తెలంగాణ హైకోర్టు శుభవార్త వినిపించింది. గ్రూప్-1 ఫలితాలు, ర్యాంకింగ్ జాబితాపై హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని కొట్టివేసి, నియామక పత్రాలు అందించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. 

సింగిల్ జడ్జ్ తీర్పులో ఏముందంటే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మళ్ళీ మూల్యాంకనం జరపాలని, ఈ భర్తీ ప్రక్రియని 8 నెలల్లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఒకవేళ ఈ ప్రక్రియ నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయకపోతే మెయిన్ పరీక్షలని రద్దు చేయవలసి వస్తుందని కూడా హెచ్చరించారు.

ఈ తీర్పుని హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసి, అర్హత సాధించిన అభ్యర్ధులకు నియామక పత్రాలు అందించవచ్చని స్పష్టం చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్ళు శ్రమించి పరీక్షలలో విజయం సాధించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు, సరిగ్గా దసరా పండుగకు ముందు లభించిన గొప్ప జీవితకాల బహుమతి ఇదని భావించవచ్చు. 

హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరలోనే అర్హత సాధించిన అభ్యర్ధులకు నియామక పత్రాలు అందించి ఇక్కడితో ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టబోతోంది.


Related Post