పాపం ట్రంప్‌... చిన్న చిన్న కష్టాలు!

September 24, 2025

img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఎక్కడికైనా బయలుదేరుతున్నారంటే ఆయన సిబ్బంది ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంటారు. కానీ ఆయన న్యూయార్క్ నగరంలోనే ఉన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) కార్యాలయానికి వెళితే, అక్కడ ఎస్కలేటర్ పనిచేయలేదు. కష్టపడి మెట్లెక్కి సమావేశ మందిరంలో సభ్యదేశాల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగించబోతే టెలీ ప్రాంప్టర్‌ పనిచేయలేదు.

అయినప్పటికీ ట్రంప్‌ గంట సేపు సుదీర్గంగా ప్రసంగించారు. అయితే ట్రంప్‌ తన ప్రసంగంలో నిర్మాణాత్మక సలహాలు, సూచనలు చేసి ఏదైనా కీలక ప్రకటన చేస్తారని అందరూ ఎదురుచూస్తే,   ఐరాస పనితీరుని ఆక్షేపిస్తూ ప్రసంగించారు.

తాను ప్రపంచ దేశాల మద్య యుద్ధాలను ఆపేందుకు కృషి చేస్తుంటే ఐరాస కనీసం స్పందించలేదని ట్రంప్‌ అసహనం వ్యక్తం చేశారు. ఐరాస గురించి తాను గొప్పగా చెపుతుంటే ఇది ఓ నిరుపయోగమైన సంస్థగా మిగిలిపోయిందని ఆక్షేపించారు. చివరికి ఐరాసలో ఎస్కలేటర్, టెలీ ప్రాంప్టర్‌ వంటివి కూడా పనిచేయకపోతే పట్టించుకునే నాధుడే లేడని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ట్రంప్‌ ప్రకటించిన సుంకాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, ఆసియా, యూరోపియన్ దేశాల పట్ల చులకన భావం ప్రదర్శిస్తూ మాట్లాడుతున్న మాటల వల్ల ప్రపంచ దేశాలు తన పట్ల అసహనంగా ఉన్నాయనే సంగతి ట్రంప్‌కి తెలియదనుకోలేము.

కానీ ట్రంప్‌ ఐరాస కార్యాలయానికి వచ్చి మరోసారి ఈవిదంగా తన నోటికి పని చెప్పారు. ఈవిదంగా ప్రవర్తిస్తూ ఐరాస తనకు బాసటగా నిలవడం లేదని ట్రంప్‌ బాధపడి ఏం ప్రయోజనం?

The UN tried to embarrass Trump… and ended up embarrassing themselves.

Escalator dies the second he steps on it.
Teleprompter crashes the second he takes the podium.

But Trump? Still delivered a historic beatdown on the globalists.
Machines fail. The message doesn’t. pic.twitter.com/lchFbPcHrp
— Dr. Lucien Wolfe 🇺🇸 (@LucienWolfe111) September 23, 2025

Related Post