హెచ్-1బీ వీసా ఫీజ్‌పై వైట్ హౌస్ వివరణ

September 21, 2025


img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడంపై అమెరికన్ కంపెనీలు సైతం తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్‌ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ వీసాలతో వివిద దేశాలలో పని చేస్తున్న తమ ఉద్యోగులందరూ తక్షణం అమెరికా తిరిగి రావాలంటూ కొన్ని కంపెనీలు ఈ మెయిల్స్ కూడా పంపాయి. దీనిపై వైట్‌హౌస్‌ వెంటనే స్పందిస్తూ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. 

వైట్‌హౌస్‌ తరపున ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్ లీవిట్‌ జారీ చేసిన ఆ ప్రెస్‌నోట్‌ ప్రకారం.. లక్ష డాలర్లు వార్షిక ఫీజు కాదు. ఓకే ఒక్కసారి చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటికే హెచ్-1బీ వీసాలు కలిగి విదేశాలలో పనిచేస్తున్నవారికి ఇది వర్తించదు. వారు స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఎటువంటి అదనపు ఛార్జీలు విధించబడవు. వారు ఆ వీసాలతో ఎప్పటిలాగే విదేశాలకు వెళ్ళి వస్తుండవచ్చు.

ఈ లక్ష డాలర్ల ఫీజు కొత్తగా హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది తప్ప ఈ వీసాల రెన్యువల్ చేయించుకునే వారికి కాదు. ఈసారి లాటరీ తీసినప్పుడు హెచ్-1బీ వీసాలు మంజూరు అయినవారు లక్ష డాలర్లు వీసా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.     


Related Post