మరో రెండు మూడు నెలల్లో బీహార్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలో కొనసాగేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిరుద్యోగ భృతి ప్రకటించారు. 20-25 ఏళ్ళు వయసున్న నిరుద్యోగ యువత నెలకు వెయ్యి రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా 2018 శాసనసభ ఎన్నికలలో నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అప్పుడు కాంగ్రెస్ కంటే మరో రూ.16 ఎక్కువగా అంటే నెలకు రూ.3,016 చెల్లిస్తామని బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది.
మళ్ళీ 2023 ఎన్నికలలో నెలకు రూ.4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఈ హామీని అమలుచేయనే లేదు. కానీ ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తాము నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని చెప్పారు.
తెలంగాణలో పార్టీలు పోటాపోటీగా నిరుద్యోగ భృతి హామీలు ఇచ్చి మాట తప్పాయి. మరి బీహార్‌లో నితీష్ కుమార్ మాట మీద నిలబడతారో లేదో?