ఈఈలే వందల కోట్లు సంపాదించేస్తున్నారుగా!

June 12, 2025


img

గత ప్రభుత్వం సుమారు లక్ష కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో వేలకోట్లు అవినీతి, అక్రమాలు జరిగాయని ఓ పక్క జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ విచారణ జరుపుతుంటే, అదే ప్రాజెక్టులో ఇంకా అనేక అవినీతి తిమింగలాలు పట్టుబడుతూనే ఉన్నాయి. 

కాళేశ్వరం ఈఈగా చేస్తున్న నూనే శ్రీధర్‌ని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరుచగ రెండు వారాలు జ్యూడిషియల్ రిమాండ్‌ విధించింది. 

ఏసీబీ అధికారులు బుధవారం ఏకకాలంలో శ్రీధర్‌కు చెందిన 13 ప్రాంతాలలో దాడులు జరుపగా, మార్కెట్‌ వ్యాల్యూ ప్రకారం సుమారు రూ.150-200 కోట్లు విలువైన ఆస్తులు సంపాదించినట్లు కనుగొన్నారు. ఆ వివరాలు: 

తెల్లాపూర్‌లో ఒక వీళ్ళ, షేక్ పేట్‌లోని స్కైహై బహుళ అంతస్తుల భవనంలో 4,500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన విలాసవంతమైన ఫ్లాట్, హైదరాబాద్‌, అమీర్ పేట్ జంక్షన్ వద్ద ఓ కమర్షియల్ కాంప్లెక్స్, హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లో మూడు భవనాలు, కరీంనగర్‌లో మూడు ప్లాట్లు, కరీంనగర్‌లో 16 ఎకరాల వ్యవసాయ భూమి, వేర్వేరు ప్రాంతాలలో 19 ఇళ్ళ స్థలాలు, రెండు కార్లు, లాకారులో భారీగా వెండి బంగారు వజ్రాభరణాలు, ఫిక్స్ డిపాజిట్లు కనుగొన్నారు. వాటి విలువ సుమారు రూ.150-200 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 

నీటిపారుదల శాఖలో ఓ ఈఈ స్థాయి అధికారి వంద కోట్లు సంపాదించగలిగితే, ఇన్ని ప్రాజెక్టులు నిర్మించిన కేసీఆర్‌ కుటుంబం ఇంకెంత సంపాదించుకుందో? ఎవరూ ఊహించలేమని కేంద్ర మంత్రి, బీజేపి ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.


Related Post